రాయదుర్గం.మండలం ఉూ దెగోళం సమీపంలో. రోడ్డుప్రమాదం.
విజయవాడ, 4 మార్చి (హి.స.) అనంతపురం: రాయదుర్గం మండలం ఊడెగోళం సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బొలెరో వాహనం అదపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 18 ఏళ్ల యువతి చనిపోయింది. ఈ ప్రమాదంలో వెనక కూర్చున్న
రాయదుర్గం.మండలం ఉూ దెగోళం సమీపంలో. రోడ్డుప్రమాదం.


విజయవాడ, 4 మార్చి (హి.స.)

అనంతపురం: రాయదుర్గం మండలం ఊడెగోళం సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బొలెరో వాహనం అదపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 18 ఏళ్ల యువతి చనిపోయింది. ఈ ప్రమాదంలో వెనక కూర్చున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా శ్రీక్యాతలింగేశ్వర, బొమ్మాలింగేశ్వర జాతరకు వచ్చి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో 35 మంది ఉన్నారు. క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande