తెలంగాణ, హైదరాబాద్. 4 మార్చి (హి.స.)
హైదరాబాద్ లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. కారును వెనక నుంచి డీసీఎం వాహనం ఢీకొనడంతో ఒకరు అక్కడిక్కడే మృతి చెందారు.
మంగళవారం జరిగిన ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కార్తీక్ అక్కడిక్కడే మృతి చెందగా అతని భార్య, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక్ మరణంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్