సమ్మక్క -సారలమ్మ జాతర, గోదావరీ పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు దేవాదాయ అధికారులు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ.
తెలంగాణ, 4 మార్చి (హి.స.) మేడారం సమ్మక్క -సారలమ్మ జాతర మరియు గోదావరీ పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు దేవాదాయ అధికారులు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. మంగళవ
డిప్యూటీ సీఎం


తెలంగాణ, 4 మార్చి (హి.స.) మేడారం సమ్మక్క -సారలమ్మ జాతర మరియు గోదావరీ పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు దేవాదాయ అధికారులు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రీ బడ్జెట్ సమావేశంలో భాగంగా దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల సమావేశం నిర్వహించారు. వందల కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులు భవిష్యత్తులోనూ ఉపయోగపడేలా అధికారులు ప్రణాళికలు సిద్దం చేయాలని వారు ఆదేశించారు. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలంటే ఇప్పటినుంచే అధికారులు అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande