తెలంగాణలో రెండవ రోజు కొనసాగుతున్న కరీంనగర్ -మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..
హైదరాబాద్, 4 మార్చి (హి.స.) తెలంగాణలో కరీంనగర్ -మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ రెండో రోజు కూడా కొనసాగుతుంది. అయితే ఈ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు లో భారీ మొత్తంలో చెల్లని ఓట్లుగుర్తించినట్లు వార్త
ఎలక్షన్ కౌంటింగ్


హైదరాబాద్, 4 మార్చి (హి.స.)

తెలంగాణలో కరీంనగర్ -మెదక్-

నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ రెండో రోజు కూడా కొనసాగుతుంది. అయితే ఈ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు లో భారీ మొత్తంలో చెల్లని ఓట్లుగుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే నిన్న మొత్తం బ్యాలెట్ బాక్సులను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి అందులో ఉన్న ఓట్లను బయటకు తీసి కట్టలు కట్టే ప్రక్రియ చేశారు. అలాగే ఓట్ల గుర్తింపు కూడా చేశారు. ఈ క్రమంలో చెల్లని ఓట్లను పక్కకు పెట్టిన ఎన్నికల అధికారులు.. ఈ రోజు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తుంది. కాగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సాయంత్రం వరకు పూర్తవ్వనుండగా.. ఈ ఫలితం సాయంత్రం తర్వాత వచ్చే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం వరకు ఏ అభ్యర్థులు లీడ్లో ఉన్నారనే ట్రెండ్ మొదలుకానుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande