హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి ని కలిసిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు
తెలంగాణ, హైదరాబాద్. 4 మార్చి (హి.స.) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)18వ సీజన్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో క్రీడా పాత్రికేయులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావును స్పోర్ట్స్ జ
స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్


తెలంగాణ, హైదరాబాద్. 4 మార్చి (హి.స.)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)18వ సీజన్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో క్రీడా పాత్రికేయులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావును స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్ట్) ప్రతినిధులు కోరారు. ఐపీఎల్ కవరేజీ కోసం స్టేడియానికి వచ్చే జర్నలిస్ట్లకు బీసీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande