వరుసగా 10వ రోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ఏ.పీ, 4 మార్చి (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. వరుసగా 10వ రోజు కూడా మార్కెట్ నష్టాలతో ముగిసింది. ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధంతో ఇన్లెస్టర్లలో గబులు మొదలైంది. దీంతో గత కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ వరుస నష్టా
స్టాక్ మార్కెట్


ఏ.పీ, 4 మార్చి (హి.స.)

దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. వరుసగా 10వ రోజు కూడా మార్కెట్ నష్టాలతో ముగిసింది. ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధంతో ఇన్లెస్టర్లలో గబులు మొదలైంది. దీంతో గత కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ వరుస నష్టాలను ఎదుర్కొంటోంది. మంగళవారం ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు చివరిదాకా అలానే కొనసాగింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 96 పాయింట్లు నష్టపోయి 72, 989 దగ్గర ముగియగా.. నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 22, 082 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే 9 పైసలు పెరిగి 87.27 దగ్గర ముగిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande