పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య . మంచిర్యాల జిల్లాలో ఘటన
మంచిర్యాల, తెలంగాణ. 4 మార్చి (హి.స.) పరీక్షల్లో ఫెయిల్ అవుతుందనే భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్ పల్లి గ్రామానికి చెందిన హాసిని (18) చెన్నూరులోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదివేది,చదువు ఇ
సూసైడ్


మంచిర్యాల, తెలంగాణ. 4 మార్చి (హి.స.) పరీక్షల్లో ఫెయిల్ అవుతుందనే భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్ పల్లి గ్రామానికి చెందిన హాసిని (18) చెన్నూరులోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదివేది,చదువు ఇష్టం లేక ఇంటికి రావడంతో విద్యార్థిని తండ్రి ఆమెను బలవంతంగా మంచిర్యాలలోని ప్రైవేట్ కళాశాలలో చేర్పించాడు.

అయితే ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతుండడంతో, ఫెయిల్ అవుతానని భయపడ్డ విద్యార్థిని మంగళవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీస్ లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande