లఖ్‌నవూ: 4 మార్చి (హి.స.)మహాకుంభమేళా జరిగిన సమయంలో త్రివేణి సంగమ జలాల్లో కాలుష్యం పెచ్చుమీరిందంటూ వచ్చిన వార్తల్ని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం కొట్టిపారేశారు. లఖ్‌నవూలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘మలినాలున్నాయంటూ వచ్చిన ఆరోపణలు నిరాధారమే అయిన్పటికీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, ఇతర స్వతంత్ర ప్రయోగశాలలు జలనాణ్యత పరీక్షలు నిర్వహించి త్రివేణి సంగమ జలాలు సురక్షిత స్థాయిలోనే ఉన్నాయని తేల్చాయి’’ అని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. మహాకుంభమేళా అతిభారీ స్థాయిలో జరిగిన ఘటన కాబట్టే యునెస్కో తదితర సంస్థలు సంగమ జలాలు సురక్షితమైనవేనా అన్న ప్రశ్న లేవనెత్తాయన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు