ఒంటిమిట్ట. కోదండ రామాల్లయానికి తిరుపతిలో.ప్రత్యేకంగ తయారు.చేయించిన స్వర్ణ.కలశం టిటిడి.అధికారులు.తీసుకొచ్చారు
విజయవాడ, 4 మార్చి (హి.స.) ఒంటిమిట్ట, ఒంటిమిట్ట కోదండ రామాలయానికి సోమవారం తిరుపతిలో ప్రత్యేకంగా తయారు చేయించిన స్వర్ణ కలశాన్ని తితిదే అధికారులు తీసుకొచ్చారు. రామయ్య క్షేత్రంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రూ.57.43 లక్షలతో జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. ఈ
ఒంటిమిట్ట. కోదండ రామాల్లయానికి తిరుపతిలో.ప్రత్యేకంగ తయారు.చేయించిన స్వర్ణ.కలశం టిటిడి.అధికారులు.తీసుకొచ్చారు


విజయవాడ, 4 మార్చి (హి.స.)

ఒంటిమిట్ట, ఒంటిమిట్ట కోదండ రామాలయానికి సోమవారం తిరుపతిలో ప్రత్యేకంగా తయారు చేయించిన స్వర్ణ కలశాన్ని తితిదే అధికారులు తీసుకొచ్చారు. రామయ్య క్షేత్రంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రూ.57.43 లక్షలతో జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో విమాన గోపురంపై రాగి కలశం స్థానంలో బంగారంతో ఏర్పాటు చేయాలని తితిదే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రత్యేకంగా కలశాన్ని తయారు చేయించి రూ.43 లక్షలతో బంగారంతో తాపడం చేశారు. పర్యవేక్షకుడు హనుమంతయ్య ఆధ్వర్యంలో ఒంటిమిట్టకు తరలించారు..తూర్పు గోపురం ముంగిట్లో అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయంలోకి తీసుకొచ్చారు. ఈ నెల 9న మహాకుంభాభిషేకం సందర్భంగా విమాన గోపురంపై స్వర్ణ కలశాన్ని ప్రతిష్ఠ చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande