నంద్యాల జిల్లా, 4 మార్చి (హి.స.)
:అదిగో పులి.. ఇదిగోపులి.. శ్రీశైలం నాగార్జునసాగర్ అభ్యారణ్యంలో ఇదే మాట వినిపిస్తోంది. ఎక్కడ చూసినా పెద్దపులులు చిరుతలు దర్శనమిస్తున్నాయి. ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి. వాటిని డైవర్టు చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. శ్రీశైలం పరిసరాల్లో పులులు, చిరుతలు హల్ చల్ చేస్తున్నాయి. జనావాసాల్లో పులులు సంచరించడంవల్ల జనాలు రాత్రి సమయంలో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మరోవైపు నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలో సమ్మర్ సీజన్‌లో పులులు మృత్యువాత పడుతున్నాయి. దీంతో జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల