వంతెన పనులు సత్వరం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
తెలంగాణ, హైదరాబాద్. 4 మార్చి (హి.స.) వంతెన పనులు సత్వరం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. నాచారం బాబానగర్ రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న నాచారం పెద్ద నాలాపై రూ. 94 లక్షల వ్యయంతో నిర్మి
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి


తెలంగాణ, హైదరాబాద్. 4 మార్చి (హి.స.) వంతెన పనులు సత్వరం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. నాచారం బాబానగర్ రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న నాచారం పెద్ద నాలాపై రూ. 94 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మంగళవారం పర్యవేక్షించడం జరిగింది.

ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులు నాలాకి అడ్డుగా ఉన్న మంచినీటి పైపు తొలగించాల్సిందిగా జలమండలి వారికి తెలియచేసిన కూడా రావడం లేదని చెప్పడంతో అప్పటికప్పుడు జలమండలి జీఎంతో మాట్లాడి తక్షణమే అడ్డుగా ఉన్న మంచినీటి పైపులైన్ తొలగించాలని ఎమ్మెల్యే సూచించడం జరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande