.పట్టభద్రులు. గాబ్యాలెట్ పేపర్ వినియోగంలో తడబడ్డాడు
విజయవాడ, 5 మార్చి (హి.స.) పట్టభద్రులే పట్టు తప్పారు. బ్యాలెట్‌ పేపరు వినియోగంలో తడబడ్డారు. ఏకంగా 11.05 శాతంమంది ఓట్లు చెల్లకుండా పోయాయంటే ఏ స్థాయిలో పొరపాట్లు చేశారో అర్థం చేసుకోవచ్చు. పోటీ చేసిన ప్రధాన అభ్యర్థుల తరువాత మూడో స్థానంలో నిలిచింది ఈ చెల
.పట్టభద్రులు. గాబ్యాలెట్ పేపర్ వినియోగంలో తడబడ్డాడు


విజయవాడ, 5 మార్చి (హి.స.)

పట్టభద్రులే పట్టు తప్పారు. బ్యాలెట్‌ పేపరు వినియోగంలో తడబడ్డారు. ఏకంగా 11.05 శాతంమంది ఓట్లు చెల్లకుండా పోయాయంటే ఏ స్థాయిలో పొరపాట్లు చేశారో అర్థం చేసుకోవచ్చు. పోటీ చేసిన ప్రధాన అభ్యర్థుల తరువాత మూడో స్థానంలో నిలిచింది ఈ చెల్లని ఓట్లే. శాసనసమండలి ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికలో ఓటేసిన వారందరూ విద్యావంతులే. వీరిలో చాలామంది గత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓట్లు వేశారు. అయినా తడబడ్డారు. సోమవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పట్నుంచి చెల్లని ఓట్లు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో అధికారులు, సిబ్బంది విస్తుపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande