ఏ.పీ, అమరావతి. 5 మార్చి (హి.స.) తమ ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామన్నారు. స్పీకర్పై తప్పుడు రాతలు బాధాకరమన్నారు. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారని, ప్రజాప్రతినిధులుగా ప్రజలు తరపున పోరాడాల్సి ఉందన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా ఇది కరెక్టు కాదని, చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. బుధవారం అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు.
'
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..