కూటమి ప్రభుత్వం రావడంతోనే ఆశా కార్యకర్తల కోర్కెల పై.దృష్టి పెట్టింది
విజయవాడ, 5 మార్చి (హి.స.)పాలకొల్లు, కూటమి ప్రభుత్వం రావడంతోనే ఆశా కార్యకర్తల న్యాయమైన కోర్కెలపై దృష్టి పెట్టింది. ఉద్యోగ విరమణ అనంతరం గ్రాట్యుటీ ఇవ్వడానికి పచ్చజెండా ఊపింది. ఉద్యోగ విరమణ వయసు 62కు పెంచింది. జీతంతో కూడిన 3 నెలల ప్రసూతి సెలవులు ఇవ్వడా
కూటమి ప్రభుత్వం రావడంతోనే ఆశా కార్యకర్తల కోర్కెల పై.దృష్టి పెట్టింది


విజయవాడ, 5 మార్చి (హి.స.)పాలకొల్లు, కూటమి ప్రభుత్వం రావడంతోనే ఆశా కార్యకర్తల న్యాయమైన కోర్కెలపై దృష్టి పెట్టింది. ఉద్యోగ విరమణ అనంతరం గ్రాట్యుటీ ఇవ్వడానికి పచ్చజెండా ఊపింది. ఉద్యోగ విరమణ వయసు 62కు పెంచింది. జీతంతో కూడిన 3 నెలల ప్రసూతి సెలవులు ఇవ్వడానికి అంగీకరించడంతో ఉమ్మడి జిల్లాలోని ఆశా కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

. ఉమ్మడి జిల్లాలో ఆశాలుగా పనిచేస్తున్న వారిలో అత్యధిక శాతం నడి వయసులో ఉన్నవారే. వీరందరికీ ఉద్యోగ విరమణ నాటికి కనీసం రూ.2 లక్షలు పైబడి గ్రాట్యుటీ అందనుంది. ప్రభుత్వ ప్రకటనపై పశ్చిమగోదావరి ఆశా కార్యకర్తల జిల్లా నాయకురాలు డి.జ్యోతి స్పందిస్తూ వాగ్దానాల అమల్లో ఒక అడుగు ముందుకు పడిందన్నారు. ఆశా కార్యకర్తల జీతాలు పెంచడంతోపాటు చనిపోయిన వారికి మట్టి ఖర్చులు, టీఏ డీఏలు కూడా అందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఆరోగ్యంలో కీలకపాత్ర.. గర్భిణుల నుంచి బాలింతల వరకు ఆరోగ్యంగా ఉండేలా చూడటంలో ఆశాలదే కీలకపాత్ర. నవజాత శిశువులకు అన్ని రకాల వైద్యసేవలు సకాలంలో అందేలా చూడటంలోను వీరు చురుగ్గా పనిచేస్తున్నారు. వైద్యఆరోగ్యశాఖకు సంబంధించి ఏ సర్వే నిర్వహించాలన్నా క్షేత్రస్థాయిలో సైన్యంలా పనిచేస్తున్నారు. ఏడాదికి 26 రకాల నివేదికలు ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande