తెలంగాణ, ఆసిఫాబాద్. 5 మార్చి (హి.స.)
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఎనోలి గ్రామంలో తలెత్తిన నీటి సమస్య తీర్చాలని ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్థులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నీటి సమస్య పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు కోరినప్పటికి పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
ఇంటింటికి నల్లా ద్వారా అందించే మిషన్ భగీరథ నీళ్లు రాక సంవత్సరాలు గడుస్తుందని, కనీసం త్రాగేందుకు కూడా నీరు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న రెండు బోర్లలో నీరు అడుగంటుకుపోవడంతో సమస్య తీవ్రమైందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్