ఛత్రపతి శివాజీ ఒక వ్యక్తి కాదు.. మహాశక్తి.. బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్
తెలంగాణ, 5 మార్చి (హి.స.) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ, శంభీపూర్ చౌరస్తాలో మంగళవారం రాత్రి ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిధులుగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, ఈటెల రాజేందర్, నిజామాబాద్ పార్లమె
ఈటెల రాజేందర్


తెలంగాణ, 5 మార్చి (హి.స.) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ, శంభీపూర్ చౌరస్తాలో మంగళవారం రాత్రి ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిధులుగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, ఈటెల రాజేందర్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ హిందూ ధర్మం పై జరుగుతున్న దాడులు దుష్ట శక్తులను ఎదుర్కోవడానికి హిందూ సమాజం సంఘటితం కావాలన్నారు. ఛత్రపతి శివాజీ పోరాట పటిమతో ఒక్కొక్క విదేశీ మొగలాయి ముష్కరులను తరిమికొట్టి కోటలను స్వాధీనం చేసుకున్నారన్నారు.

శివాజీ ప్రాణత్యాగం ఊరికే పోకూడదు అంటే కులాలు పక్కన పెట్టి హిందూ ధర్మం కోసం చైతన్యులు కావాలన్నారు. ఛత్రపతి శివాజీ ఒక వ్యక్తి కాదని మహాశక్తి అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande