ఏ.పీ, 5 మార్చి (హి.స.)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మార్చి 5,6 తేదీల్లో అనగా నేడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి.. విజయవాడ పోరంకిలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నివాసానికి సీఎం వెళ్లనున్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి.. మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీలను ఏపీ సీఎం కలవనున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు ఓ వివాహ వేడుకకు చంద్రబాబు హాజరుకానున్నారు.
సీఎం చంద్రబాబు ఈరోజు రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకుంటారు. గురువారం ఉదయం 10.30 గంటలకు గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారు. రేపు మధ్యహ్నం 1.30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం 5.30కు భారత్ మండపంలో జరిగే ఒక టీవీ కాంక్లేవ్ లో చంద్రబాబు పాల్గొంటారు. రేపు రాత్రి ఢిల్లీలోనే బస చేసి.. ఎల్లుండి ఉదయం బయలుదేరి అమరావతికి వస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..