తాజ్ బంజారా చెరువు వద్ద అక్రమ డంపింగ్ చేస్తున్న వ్యక్తుల మీద కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.
హైదరాబాద్, 5 మార్చి (హి.స.) హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1లో తాజ్ బంజారా చెరువు వద్ద అక్రమ డంపింగ్ చేస్తున్న వ్యక్తుల మీద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు లారీల ద్వారా మట్టిని డంపింగ్ చేస్తున్నారని మంగళవా
డంపింగ్ వ్యక్తులపై కేసు


హైదరాబాద్, 5 మార్చి (హి.స.) హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1లో తాజ్ బంజారా చెరువు వద్ద అక్రమ డంపింగ్ చేస్తున్న వ్యక్తుల మీద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కొంతమంది ప్రైవేటు వ్యక్తులు లారీల ద్వారా మట్టిని డంపింగ్ చేస్తున్నారని మంగళవారం రాత్రి సమాచారం అందుకున్న నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు, జోనల్ కమిషనర్కు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు డంపింగ్ చేస్తున్న రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాన రోడ్డు మీద జీహెచ్ఎంసీ పార్క్ గేట్ నుంచి అక్రమంగా లోపలకి వెళ్లి ప్రైవేటు వ్యక్తులు డంపింగ్ చేస్తున్నారని టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుల మీద బీఎన్ఎస్ 324(3), 329(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande