తెలంగాణ, ఆదిలాబాద్. 5 మార్చి (హి.స.)
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఘన్పూర్ పంచాయతీలో గల చింతగూడ గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదంలో ఆదివాసి రైతు ఇల్లు పూర్తిగా దగ్ధమైందని, బాధితుడు గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జరిగిన అగ్నిప్రమాదం వల్ల ఇంట్లో నిల్వ ఉంచిన ఏడు క్వింటాళ్ల పత్తితో పాటు, అరవై వేల నగదు, సామాగ్రి వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయని కన్నీరు మున్నీరయ్యాడు..
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్