తెలంగాణ, 5 మార్చి (హి.స.)
హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న ఓ మహిళకు గుండె పోటు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. గుండెపోటు వచ్చి సడెన్ గా పడిపోవడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఫ్లైట్ ను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఆమెను వెంటనే విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మహిళ మృతిచెందారు. మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.
కతార్ రాజధాని దోహా నుంచి బంగ్లాదేశ్ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. మహిళకు సీపీఆర్ చేసిన సిబ్బంది వెంటనే హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందూ మహిళ మృతి చెందడంతో ఎయిర్ పోర్ట్ లో విషాదం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్