రంగనాయక సాగర్ ను సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు..
తెలంగాణ, సిద్దిపేట. 5 మార్చి (హి.స.) సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం చంద్లపూర్ లోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ను బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగనాయక సాగర్ లోకి నీటిని విడ
హరీష్ రావు


తెలంగాణ, సిద్దిపేట. 5 మార్చి (హి.స.) సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం చంద్లపూర్ లోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ను బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగనాయక సాగర్ లోకి నీటిని విడుదల చేసినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచి పెట్టాలని చూస్తుంది అని ఆరోపించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (ఎస్ఆర్ఎస్పీ)లో నీరు తగ్గిన కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశాం అన్నారు. ఇక, మేడిగడ్డలోని ఒక్క బ్లాక్ లో ఒక పిల్లర్ మాత్రమే కుంగితే మాపై బురద జల్లి అధికారంలోకి వచ్చారు అని హరీష్ రావు విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande