తెలంగాణలో. పట్టభద్రుల ఎమ్మెల్సీ.ఓట్ల.లెక్కింపు
కరీంనగర్‌ 5 మార్చి (హి.స.): కరీంనగర్‌-నిజామాబాద్‌-మెదక్‌-ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. తొమ్మిదో రౌండ్‌లో భాజపా అభ్యర్థి అంజిరెడ్డికి 6,245 ఓట్లు వచ్చాయి
తెలంగాణలో. పట్టభద్రుల ఎమ్మెల్సీ.ఓట్ల.లెక్కింపు


కరీంనగర్‌ 5 మార్చి (హి.స.): కరీంనగర్‌-నిజామాబాద్‌-మెదక్‌-ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. తొమ్మిదో రౌండ్‌లో భాజపా అభ్యర్థి అంజిరెడ్డికి 6,245 ఓట్లు వచ్చాయి. దీంతో 9 రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయనకు మొత్తంగా 63,871 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌ రెడ్డి 9వ రౌండ్‌లో 6,921 ఓట్లు సాధించారు. 9 రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయనకు మొత్తంగా 59,831 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం భాజపా అభ్యర్థి అంజిరెడ్డి 4,040 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 2,24,000కాగా.. ఇప్పటివరకు 1,89,000 ఓట్ల లెక్కింపు పూర్తయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande