తెలంగాణ, జనగామ. 5 మార్చి (హి.స.)
ఖాకీలంటే కాఠిన్యమే కాదు, కరుణను సైతం పంచుతారనే ఉదంతం జనగామలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు హాజరు కావాల్సిన ఓ విద్యార్థిని జనగామ అర్బన్ పోలీసులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేర్చి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు.
సునీత అనే ఫస్టియర్ విద్యార్థిని పొరపాటున తను పరీక్ష రాయాల్సిన సెంటర్కు బదులు మరొక సెంటర్కు వెళ్లింది. ఈ క్రమంలో ప్రెస్టన్ కాలేజీ వద్ద విద్యార్థిని సునీత కంగారు పడుతున్న తీరును గమనించిన సీఐ దామోదర్ రెడ్డి, ఎస్ఐ చెన్నకేశవులు సదరు విద్యార్థినిని సకాలంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీ సెంటర్ కు పోలీసు వాహనంలో చేర్చారు. పోలీసులు స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్