విజయవాడ, 5 మార్చి (హి.స.)మంగళగిరి, మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు పెండ్లికుమారుని ఉత్సవం నిర్వహిస్తారు. పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం కైంకర్యపరులుగా వ్యవహరిస్తోంది.
..6వ తేదీ ధ్వజారోహణం, సంతానం లేని భక్తులకు గరువు ముద్దలను ప్రసాదం పంపిణీ, 7న హనుమంత వాహన సేవ, 8న రాజాధిరాజ, 9న ముత్యాలపల్లకి, యాలి వాహనం, 10న చిన్నశేష, సింహ వాహనాలు, 11న హంస, గజవాహనాలు, 12న కల్పవృక్ష, పొన్న వాహనాలు, 13న అశ్వవాహనంపై స్వామివారు విహరిస్తారు. 13వ తేదీ రాత్రి దివ్య కల్యాణ మహోత్సవం, 14న ఉదయం 6 గంటలకు బంగారు గరుడ వాహనంపై గ్రామోత్సవం, సాయంత్రం 3 గంటలకు దివ్య రథోత్సవం నిర్వహిస్తారు. 15న చక్రధారి చూర్ణోత్సవం, వసంతోత్సవం, 16న పుష్పయాగోత్సవం క్రతువులు జరిపిస్తారు. ఈ నెల 17 నుంచి 30 వరకు ఆస్థాన అలంకారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవాదాయ సహాయ కమిషనర్ అన్నపురెడ్డి కోటిరెడ్డి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల