ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్
తెలంగాణ, 5 మార్చి (హి.స.) ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకునేందుకు సమగ్ర సర్వేలో బీసీ ల లెక్కను తగ్గించి తూతూమంత్రంగా సర్వే చేపట్టారని అదే సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుగడ అని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వాఖ్యలు చేశారు. అదే
మంత్రి సీతక్క కౌంటర్


తెలంగాణ, 5 మార్చి (హి.స.)

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకునేందుకు సమగ్ర సర్వేలో బీసీ ల లెక్కను తగ్గించి తూతూమంత్రంగా సర్వే చేపట్టారని అదే సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుగడ అని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వాఖ్యలు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పులతడక అని నిరూపిస్తానని ఆయన సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. తీన్మార్ మల్లన్న వెనుక బీసీలు ఎవరూ లేరని.. కొందరు బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకులే ఆయనతో మాట్లాడిస్తున్నారని కామెంట్ చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఏ ప్రభుత్వం చేయని కులగణను చేపట్టామని.. ఈ విషయంలో తమను అభినందిచాల్సింది పోయి విమర్శలు చేయడం సమంజసం కాదని అన్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీతో పోల్చుకునే స్థాయి మల్లన్నకు లేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande