తెలంగాణ, మెదక్. 5 మార్చి (హి.స.)
నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య- ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరుగగా, ఆయన అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ... వచ్చే విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభమయ్యేలా నూతన మెడికల్ కాలేజీలను సిద్దం చేయాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు.మెడికల్ కాలేజీలలో మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్