ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్
తెలంగాణ, నిజామాబాద్. 5 మార్చి (హి.స.) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిర్మల హృదయ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు
నిజామాబాద్ కలెక్టర్


తెలంగాణ, నిజామాబాద్. 5 మార్చి (హి.స.) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిర్మల హృదయ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీసీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష నిర్వహిస్తున్నారా ? నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా ? లేదా ? అని పరిశీలించారు.

పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ఏఎన్ఎం, టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయా అని గమనించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande