తెలంగాణ, నిజామాబాద్
5 మార్చి (హి.స.)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక డైవర్ట్ పాలిటిక్స్ చేయడంలో రేవంత్ రెడ్డికి ఎవరూ సాటిలేరని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. పరీక్షల సమయం మాత్రమే రేవంత్ రెడ్డి మార్చాడు.. కానీ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని మార్చే ఆలోచనలో ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చే సమయం దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే సీఎం రేవంత్ రెడ్డి అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టులకు బీజేపీ అడ్డుపడిందా ? రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్