పాఠాలు చెప్పిన ప్రథమ పౌరురాలు
ఢిల్లీ,, 5 మార్చి (హి.స.)భారత్‌: పూర్వాశ్రమంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరోమారు ఆ పాత్రను పోషించారు. ప్రెసిడెంట్‌ ఎస్టేటులోని డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు వెళ్లి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బ
పాఠాలు చెప్పిన ప్రథమ పౌరురాలు


ఢిల్లీ,, 5 మార్చి (హి.స.)భారత్‌: పూర్వాశ్రమంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరోమారు ఆ పాత్రను పోషించారు. ప్రెసిడెంట్‌ ఎస్టేటులోని డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు వెళ్లి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. తొలుత విద్యార్థుల పేర్లు ఆరా తీసిన రాష్ట్రపతి వారి అభిరుచులు, లక్ష్యాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భూమి వేడెక్కటం.. పర్యావరణ ప్రాధాన్యం, నీటి సంరక్షణ అంశాలను బోధించారు. పర్యావరణ మార్పుల ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే వీలైనంత ఎక్కువగా మొక్కలు నాటాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్‌ పేడ్‌ మాకే నామ్‌’ (అమ్మ పేరుతో ఒక మొక్క) గురించీ ప్రస్తావించారు. ప్రతి విద్యార్థి తమ పుట్టినరోజున ఓ మొక్క నాటాలని రాష్ట్రపతి సూచించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande