పైరసీకి అడ్డుకట్ట వేయాలంటే ఓ ఉద్యమం కావాలి. నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ, హైదరాబాద్. 5 మార్చి (హి.స.) మూవీ పైరసీని అరికట్టేందుకు ఓ ఉద్యమం రావాలని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అన్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ సందర్భంగా ఆయన ఇవాళ హైదరాబాదులో మీడియాతో మా
దిల్ రాజు


తెలంగాణ, హైదరాబాద్. 5 మార్చి (హి.స.)

మూవీ పైరసీని అరికట్టేందుకు ఓ ఉద్యమం రావాలని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అన్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ సందర్భంగా ఆయన ఇవాళ హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ.. రూ.కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తుంటే అవి పైరసీకి గురై నిర్మాతలు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో నటీనటులు, హీరోలు తనకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ను పైరసీ భూతం పట్టి పీడిస్తోందని తెలిపారు. మూవీ రిలీజ్కు ముందు అంతా బాగానే ఉంటుందని.. ఆ తరువాత మూవీ రిలీజై నిర్మాత నష్టపోతే పట్టించుకోకుండా మరో సినిమా పనిలో అంతా బీజీగా ఉంటున్నారని కామెంట్ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande