విజయవాడ, 5 మార్చి (హి.స.)
కల్లూరు కారు సహా ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శేషాచలం అడవి భాకరాపేట, చిన్నగొట్టిగల్లు నుంచి పులిచెర్ల మండలం 106రామిరెడ్డిగారిపల్లె మీదుగా సుమారు రెండు నెలలుగా ఎర్రచందనం రవాణా జరుగుతోంది. రాత్రి వేళల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు వెళ్తుండటంతో అనుమానం వచ్చిన జనసేన మండల అధ్యక్షుడు చంద్రబాబు కల్లూరు పోలీసులను అప్రమత్తం చేశారు. సోమవారం రాత్రి పోలీసులు గ్రామానికి చేరుకుని పహారా కాశారు. మంగళవారం వేకువజామున చిన్నగొట్టిగల్లు నుంచి రెండు ద్విచక్ర వాహనాలు రావడాన్ని గమనించారు. వాటిని వెంబడించగా ఓ వ్యక్తి పొలాల్లోకి దూకి పరారయ్యాడు. చుట్టుపక్కల గాలించగా గ్రామ సమీప మామిడి తోటలో నిలిపి ఉన్న ఓ కారులో 8 ఎర్రచందనం దుంగలు, దొంగ నంబరు ప్లేట్లు ఉండటాన్ని గుర్తించారు. కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల