నిలకడగా సింగర్ కల్పన ఆరోగ్యం.. ఆక్సిజన్ కొనసాగింపు..
హైదరాబాద్, 5 మార్చి (హి.స.)ప్రముఖ పాపులర్ తెలుగు సింగర్ కల్పనకు సంబంధించి హెల్త్ అప్డేట్ను నిజాంపేట హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రాణ హాని లేదని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. మంగళవా
సింగర్ కల్పన


హైదరాబాద్, 5 మార్చి (హి.స.)ప్రముఖ పాపులర్ తెలుగు సింగర్ కల్పనకు సంబంధించి హెల్త్ అప్డేట్ను నిజాంపేట హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రాణ హాని లేదని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు కల్పనను ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే స్టమక్ వాష్ చేయించినట్లు చెప్పారు.

అనంతరం ఐసీయూలో అత్యవసర చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. అధిక ఒత్తిడికి గురైతే లంగ్స్ లోకి నీరు చేరుతుందని.. అందుకే వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చినట్లు చెప్పారు. వెంటిలేటర్ రెండు గంటలే ఉంచామని.. అనంతరం తొలగించినట్లు తెలిపారు. నిద్ర టాబ్లెట్ల ప్రభావం అయితే ప్రస్తుతం శరీరంపై లేదని.. ప్రస్తుతం ఆరోగ్యం కుదిటగానే ఉందని చెప్పారు. కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందని.. ఆక్సిజన్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఎక్కువ మోతాడులో స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్లే అనారోగ్యం పాలైనట్లు వైద్యులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande