హైదరాబాద్. 5 మార్చి (హి.స.) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీకి పునాది వేసింది తానే అని మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను హైదరాబాదులో మాట్లాడిన ఆయన ఈ ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఇందుకు కారణం రేవంత్ రెడ్డినే అని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ పార్లమెంట్ సీటు, రేవంత్ రెడ్డి సిట్టింగ్ మల్కాజ్గరి రెండు సీట్లల్లో కావాలని కాంగ్రెస్ పార్టీని ఓడించాడు. ఒక వేళ రేవంత్ రెడ్డి బలంగా ప్రచారం చేసి ఉంటే.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాకపోయేది అని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమికి రేవంత్ రెడ్డినే కారణమని ఎమ్మెల్సీ మల్లన్న ఆరోపించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..