ప్రధాన లోకో పైలట్‌ ప్రశ్నపత్రం లీక్‌.. ఈసీఆర్‌లో 26మంది రైల్వే అధికారుల అరెస్టు
దిల్లీ:, 5 మార్చి (హి.స.) ప్రధాన లోకో పైలట్‌ పోస్టుల కోసం తూర్పు మధ్య రైల్వే (ఈసీఆర్‌) నిర్వహిస్తున్న పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ అయ్యింది. పరీక్ష ముందు రోజే ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)... 26 మంది రైల్వే అధికారులను సోమవారం రాత్
ప్రధాన లోకో పైలట్‌ ప్రశ్నపత్రం లీక్‌.. ఈసీఆర్‌లో 26మంది రైల్వే అధికారుల అరెస్టు


దిల్లీ:, 5 మార్చి (హి.స.) ప్రధాన లోకో పైలట్‌ పోస్టుల కోసం తూర్పు మధ్య రైల్వే (ఈసీఆర్‌) నిర్వహిస్తున్న పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ అయ్యింది. పరీక్ష ముందు రోజే ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)... 26 మంది రైల్వే అధికారులను సోమవారం రాత్రి అరెస్టు చేసింది. వీరిలో ఈసీఆర్‌ సీనియర్‌ డివిజినల్‌ ఎలక్ట్రిక్‌ ఇంజనీరు సుశాంత్‌ పరాశర్‌ సైతం ఉన్నారు. రూ.1.17 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముగల్‌ సరాయ్‌లో ప్రధాన లోకో పైలట్‌ పోస్టులను భర్తీ చేసేందుకు ఈసీఆర్‌ మంగళవారం పరీక్ష నిర్వహించాల్సి ఉంది. దీంతో స్థానికంగా ఉన్న మూడు ప్రాంతాల్లో సోమవారం రాత్రి సీబీఐ తనిఖీలు చేపట్టింది. ఈ దాడుల్లో 17 మంది అభ్యర్థుల వద్ద నుంచి చేతితో రాసి ఉన్న ప్రశ్నపత్రం కాపీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఇప్పటికే లోకో పైలెట్లుగా పనిచేయడం గమనార్హం. దీంతో అధికారులు పరీక్షను రద్దు చేశారు. ప్రశ్నపత్రం తయారీ బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ డివిజినల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని సీబీఐ పేర్కొంది. ‘ఆయన తొలుత ఆంగ్లంలో ప్రశ్నలను తయారు చేసి హిందీలోకి తర్జుమా చేసేందుకు ఓ లోకో పైలట్‌కు ఇచ్చారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande