ముంబై, 5 మార్చి (హి.స.)దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. వరుస నష్టాలు చవిచూసిన మార్కెట్ సూచీలు.. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోలుకు దిగడంతో లాభాల బాట పట్టాయి. దీంతో 10 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఆసియా మార్కెట్లలో ర్యాలీ కూడా దలాల్ స్ట్రీట్‌కు కలిసొచ్చింది. దీంతో సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో సెన్సెక్స్ 862 పాయింట్ల లాభంతో 73,860 వద్ద ట్రేడవుతుంటే.. నిఫ్టీ 287 పాయింట్ల లాభంతో 22,370 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్‌ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, జొమాటో షేర్లు మాత్రమే నష్టాల్లో కదలాడుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు