చారిత్రక అమరావతి అమరేశ్వరాలయం.ఆదాయాన్ని సిబ్బంది. వేతనాలకే .సరిపెడుతున్నారు
విజయవాడ, 6 మార్చి (హి.స.) చారిత్రక అమరావతి అమరేశ్వరాలయ ఆదాయాన్ని సిబ్బంది వేతనాలకే సరిపెడుతున్నారు. వార్షిక ఆదాయంలో సగం అందుకే ఖర్చు చేస్తున్నారు. ఆలయానికి దాతలు ఇచ్చిన భూములు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 987 ఎకరాలున్నాయి. వాటి నుంచి కౌలు వస్తోంది. హ
చారిత్రక అమరావతి అమరేశ్వరాలయం.ఆదాయాన్ని సిబ్బంది. వేతనాలకే .సరిపెడుతున్నారు


విజయవాడ, 6 మార్చి (హి.స.)

చారిత్రక అమరావతి అమరేశ్వరాలయ ఆదాయాన్ని సిబ్బంది వేతనాలకే సరిపెడుతున్నారు. వార్షిక ఆదాయంలో సగం అందుకే ఖర్చు చేస్తున్నారు. ఆలయానికి దాతలు ఇచ్చిన భూములు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 987 ఎకరాలున్నాయి. వాటి నుంచి కౌలు వస్తోంది. హుండీ ఆదాయం, టిక్కెట్ల అమ్మకం, ఇతర సేవల నుంచి ఆదాయం సమకూరుతుంది. ఇవన్నీ కలిపి ఏడాదికి రూ.3.4 కోట్లు వస్తోంది. ఇందులో నెలకు రూ.13 లక్షల చొప్పున సిబ్బందికి వేతనాలే ఇస్తున్నారు. పరిపాలన విభాగంలో పదిమంది, అర్చకులు 17 మంది, పొరుగు సేవల్లో మరికొందరు పనిచేస్తున్నారు. వీరికి ఏడాదికి సుమారు రూ.1.6 కోట్లు వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు.

నిబంధనల ప్రకారం ఆలయానికి వచ్చిన ఆదాయంలో 30 శాతానికి మించి ఖర్చు చేయకూడదు. వాటిని ఉల్లంఘించి అధికారులు కొన్నేళ్లుగా ఆదాయాన్ని వేతనాల రూపంలో చెల్లిస్తూ కరిగిస్తున్నారు. ఆలయానికి అనుబంధంగా ఉన్న సదావర్తి సత్రం సిబ్బంది వేతనాలు కూడా ఆలయ ఆదాయం నుంచే చెల్లిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande