ఏ.పీ, రాజమండ్రి. 6 మార్చి (హి.స.)
తమ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు రాజమండ్రి నుండి 'ఛలో విజయవాడ'కు బయల్దేరిన పలువురు ఆశా వర్కర్లను రైల్వేస్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆశా వర్కర్లు చలో విజయవాడకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. దాంతో నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపై ఆశా వర్కర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడకు ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల వయోపరిమితిని రెండు సంవత్సరాలకు పెంపు, మెటర్నిటీ లీవులు మంజూరు చేసింది. అయినప్పటికీ ఇవేవీ మాకొద్దు.. జీతాలే పెంచండి అంటూ ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..