తెలంగాణ, ఖమ్మం. 6 మార్చి (హి.స.)
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాటల గారెడితో అధికారంలోకి వచ్చారని, మోసపూరిత రాజకీయాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర నాయకులు చీకోటి ప్రవీణ్, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు లు ధ్వజమెత్తారు. ఖమ్మంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా అభివృద్ధి అడుగు కూడా ముందుకు వేయడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా 42 నియోజకవర్గాల్లో బీజేపీ 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో కూడా డబల్ ఇంజన్ సర్కార్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. స్కాంల కాంగ్రెస్ ను ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్