ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బిసి రిజర్వేషన్లపై మూడు బిల్లులను పెట్టాలి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్
హైదరాబాద్, 6 మార్చి (హి.స.) ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బిసి రిజర్వేషన్లపై మూడు బిల్లులను పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ కేబినెట్ భేటీ నేపథ్యంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంప
ఎమ్మెల్సీ కవిత డిమాండ్


హైదరాబాద్, 6 మార్చి (హి.స.)

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బిసి రిజర్వేషన్లపై మూడు బిల్లులను

పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ కేబినెట్ భేటీ నేపథ్యంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు వేర్వేరు బిల్లులు పెట్టాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంటుందని తెలిపారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం కేవలం రాష్ట్రం పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు. పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి కేసీఆర్ రాష్ట్ర స్థాయిలోనే చట్టం తెచ్చి సాధ్యం చేశారని అన్నారు. రాష్ట్రస్థాయిలో చట్టం ద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande