హైదరాబాద్, 6 మార్చి (హి.స.)
తెలంగాణలో భారతీయ జనతా
పార్టీది తిరుగులేని విజయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పట్టభద్రులు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారు అని తెలిపారు. హైదరాబాద్లో నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు అనడానికి ఈ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. ఖమ్మం- నల్గొండ- వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఓటమిపై సమీక్షించుకుంటాం.. మా లోపాలు కూడా ఉన్నాయి.. అక్కడ కూడా బలోపేతం అవుతామని పేర్కొన్నారు. నాపై రేవంత్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలపై నేను స్పందించను.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన నన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు.. ప్రజలు తీర్పు ఇచ్చారు.. విధాన పరమైన ఇష్యూలపై మాత్రమే స్పందిస్తాను అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఇక, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఎమ్మెల్సీ ఎన్నికలతో తేటతెల్లమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఇచ్చిన విజయంతో తమపై బాధ్యత మరింత పెరిగిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..