బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారు.-తీన్మార్‌ మల్లన్న
హైదరాబాద్, 6 మార్చి (హి.స.) బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతుంటే బీసీ నేతలను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. బీసీలను కించపరిస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశం
బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారు.-తీన్మార్‌ మల్లన్న


హైదరాబాద్, 6 మార్చి (హి.స.) బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతుంటే బీసీ నేతలను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. బీసీలను కించపరిస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం నుంచి గ్రామ గ్రామానికి బీసీ వాదాన్ని తీసుకెళ్తామని, బీసీ మేధావులతో చర్చించి భవిషత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. బీసీ జేఏసీతో కలిసి ముందుకెళ్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పు అని పత్రాలు తగులబెడితే తనను కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారా అని ప్రశ్నించారు.

బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల రక్షణ కోసమే బీసీ జనాభా తగ్గించారన్నారు. 2028లో బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande