14.2 కేజీల.బంగారాన్ని..బెంగళూరు ఎయిర్పోర్ట్ లో.కన్నడ నటి రాన్యా రావు . వద్ద పట్టుకున్నారు
బెంగళూరు 6 మార్చి (హి.స.),రన్యా రావు.. ప్రముఖ కన్నడ నటి. అంతేకాదు.. పోలీసు ఉన్నతాధికారి కుమార్తె. ఏడాది కాలంలో 30 సార్లకు పైగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లి వచ్చారు. బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో దిగినప్పుడల్లా ఓ ప్రొటోకాల్‌ అధికారి ఆమెకు ఎస్
14.2 కేజీల.బంగారాన్ని..బెంగళూరు ఎయిర్పోర్ట్ లో.కన్నడ నటి రాన్యా రావు . వద్ద పట్టుకున్నారు


బెంగళూరు 6 మార్చి (హి.స.),రన్యా రావు.. ప్రముఖ కన్నడ నటి. అంతేకాదు.. పోలీసు ఉన్నతాధికారి కుమార్తె. ఏడాది కాలంలో 30 సార్లకు పైగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లి వచ్చారు. బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో దిగినప్పుడల్లా ఓ ప్రొటోకాల్‌ అధికారి ఆమెకు ఎస్కార్ట్‌ కల్పించి సెక్యూరిటీ చెక్‌లు లేకుండా బయటకు తీసుకొచ్చేవారు. అక్కడి నుంచి ప్రభుత్వ వాహనంలో దర్జాగా వెళ్లిపోయే వారు. సోమవారం రాత్రి కూడా రన్యా రావు అలాగే ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చే క్రమంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) బృందం అడ్డుకుంది. సోదాలు చేస్తే.. ఆమె నడుముకు కట్టుకొని అక్రమంగా తరలిస్తున్న 14.2 కిలోల బంగారం దొరికింది. దీని విలువ రూ. 12.56 కోట్లుగా అంచనా వేశారు. ఆ తర్వాత బెంగళూరులోని లావెల్లె రోడ్‌లో ఉన్న రన్యా రావు ఇంటిలో కూడా అధికారులు సోదాలు జరిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande