తెలంగాణ, ఖమ్మం. 6 మార్చి (హి.స.)
అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం
అడుగులు వేస్తుంది అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలం లో గురువారం భట్టి పర్యటించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో వచ్చిన మంత్రికి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ స్వాగతం పలికారు. మండలం కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం 28 కోట్లతో నిర్మించనున్న ముదిగొండ టూ వల్లబి 5 కిలోమీటర్ల రోడ్ కు శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రహదారి వల్ల ప్రజలకు ప్రయాణం సులభతరమని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్