నేను ఎమ్మెల్సీ అడగడం లేదు:-మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
హైదరాబాద్ , 6 మార్చి (హి.స.)కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈరోజు ఢిల్లీకి పయనం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎమ్మెల్సీ అడుగుతలేను.. నేను అడగొద్దు కూడా అన్నారు. నాకు పార్టీ ఆల్రెడీ టికెట్ ఇచ్చింది.. పోటీ చేసిన పరిస్థితు
నేను ఎమ్మెల్సీ అడగడం లేదు:-మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి


హైదరాబాద్ , 6 మార్చి (హి.స.)కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈరోజు ఢిల్లీకి పయనం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎమ్మెల్సీ అడుగుతలేను.. నేను అడగొద్దు కూడా అన్నారు. నాకు పార్టీ ఆల్రెడీ టికెట్ ఇచ్చింది.. పోటీ చేసిన పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓడిపోయానని పేర్కొన్నారు. నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశా.. ఎమ్మెల్సీ కావాలని పడి పడి మరి అడిగే గుణం నాది కాదు అని వెల్లడించారు. మీడియా మిత్రులు ఎవరు కూడా ఎమ్మెల్సీ విషయంలో ఊహాగానాల వార్తలు రాయొద్దని జగ్గారెడ్డి తెలియజేశారు. ఇక, 2017లో రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల గురించి వారి దృష్టికి తీసుకెళ్లాడం కోసమే గత ఆరు నెలల నుంచి ఢిల్లీకి వెళ్లాలని అనుకుంటున్నాను.. రాహుల్ సభ ఆర్గనైజేషన్, ఎలాంటి పరిస్థితుల్లో సభ ఏర్పాట్లు చేశానో ఆ విషయాలన్నింటినీ ఆయనకే స్వయంగా చెప్పాలని ఇప్పుడు హస్తినకు పోతున్నాను.. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరుతాను..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande