దిల్లీ: , 6 మార్చి (హి.స.)కాంగ్రెస్ గెలిస్తే మహిళల మంగళసూత్రాలు, ప్రజల సంపద గల్లంతవుతాయని నిరుడు లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రచారం చేశారనీ, ఇప్పుడు ఆయన హయాంలోనే ఆడవాళ్లు మంగళసూత్రాలు, నగలను తాకట్టుపెట్టే దుస్థితి దాపురించిందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం విమర్శించారు.
2019-2024 మధ్య కాలంలో నాలుగు కోట్లమంది మహిళలు బంగారం కుదువపెట్టి రూ.4.7 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారని ఆయన వివరించారు. బంగారంపై రుణాలు ఒక్క సంవత్సరంలోనే 71.3 శాతం పెరిగినట్లు ఈ ఫిబ్రవరిలో రిజర్వు బ్యాంకు తెలిపిందన్నారు. మోదీజీ మొదట పెద్ద నోట్లను రద్దు చేసి స్త్రీ ధనాన్ని మాయం చేశారనీ, ఇప్పుడు ధరలు పెరిగి పొదుపు తరిగి నగలు కుదువ పెట్టుకోవలసిన దుస్థితి దాపురించిందని ఖర్గే అన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు