తెలంగాణ, వేములవాడ. 6 మార్చి (హి.స.)
రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల పెంపుపై బడ్జెట్ కేటాయించే విధంగా చొరవ తీసుకోవాలని కోరుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు పూర్తిస్థాయిలో పెండింగ్ వేతనాలు ఇప్పించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన ఆది శ్రీనివాస్ వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ అధికారి శేషాద్రికి ఫోన్ చేసి కార్మికుల బిల్లులు చెల్లించే విధంగా చొరవ తీసుకోవాలని ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్