తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త. ఈ నెల 15 నుంచి ఒక పూట బడులు
తెలంగాణ, 6 మార్చి (హి.స.) తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రంలో మార్చి అనగా ఈ నెల 15 నుంచి ఒక పూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మార్చి 15 నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుంచి మధ
ఒక పూట బడులు


తెలంగాణ, 6 మార్చి (హి.స.) తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రంలో మార్చి అనగా ఈ నెల 15 నుంచి ఒక పూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మార్చి 15 నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బడులు నిర్వహిస్తారు. అలాగే 10వ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలలో మధ్యాహ్నం క్లాసులు నిర్వహించనున్నారు. అనంతరం అన్ని స్కూళ్లలో పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు ప్రకటించనున్నారు. కాగా ఈ సంవత్సరం ముందస్తుగానే ఎండలు దంచికొడుతుండటంతో ఒక పూట బడులు ముందస్తుగానే నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్ నెలకొన్న విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande