ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కామారెడ్డి సబ్ కలెక్టర్
తెలంగాణ, కామారెడ్డి. 6 మార్చి (హి.స.) కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల తీరు పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో మొత్తం విద్యార్థుల సంఖ్య, హాజరైన విద్యార్థుల
సబ్ కలెక్టర్


తెలంగాణ, కామారెడ్డి. 6 మార్చి (హి.స.) కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల తీరు పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో మొత్తం విద్యార్థుల సంఖ్య, హాజరైన విద్యార్థుల సంఖ్యను ప్రిన్సిపల్ మైషయ్యతో అడిగి తెలుసుకున్నారు. మాస్ కాపీ జరగకుండా చూడాలని, విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయలను పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేయాలని కళాశాల యజమాన్యాన్ని ఆదేశించారు. పరీక్షలు పకడ్బందీగా సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande