ఎస్ఎల్ బీసీ సొరంగంలో ఎనిమిది మంది ఆచూకీ గుర్తించేందుకు కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ను రప్పిస్తున్నాం.. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్.
తెలంగాణ, 6 మార్చి (హి.స.) ఎస్ఎల్ బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ గుర్తించేందుకు కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ను రప్పిస్తున్నట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం టన్నెల్ వద్ద జిల్లా కలెక్
కేరళ డాగ్స్


తెలంగాణ, 6 మార్చి (హి.స.)

ఎస్ఎల్ బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ గుర్తించేందుకు కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ను రప్పిస్తున్నట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం టన్నెల్ వద్ద జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తో కలిసి ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.ఉదయం ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఐఐటీ నిపుణులతోపాటు సైనిక అధికారులు టన్నెల్ లోపలికి వెళ్లారు. చివర నుంచి మట్టిని తీసి ఎక్సలెటర్ పై వేస్తూ నీటిని మరో వైపు దారి మళ్ళీస్తూ ముందుకు సాగాలని సూచించారు. సింగరేణి సిబ్బంది తోపాటు యాంత్రిక సహకారం తీసుకుంటూ సిబ్బంది బురదను బయటికి తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande