ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసిన ప్రభుత్వం నిజాలను దాచి ఉంచింది.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, 6 మార్చి (హి.స.) ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసిన ప్రభుత్వం నిజాలను దాచి ఉంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం (X) ఎక్స్ ఖాతా నుండి ఆసక్తికర పోస్ట్ చేశారు. ఎస్ఎబీసీ టన్నెల్ ప్
కేటీఆర్


హైదరాబాద్, 6 మార్చి (హి.స.) ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసిన ప్రభుత్వం నిజాలను దాచి ఉంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం (X) ఎక్స్ ఖాతా నుండి ఆసక్తికర పోస్ట్ చేశారు. ఎస్ఎబీసీ టన్నెల్ ప్రమాదం జరుగుతుందని ముందే రెండు నివేదికలు హెచ్చరించిన ప్రభుత్వం పట్టించుకోలేదని వెల్లడించారు. కార్మికుల ప్రాణాలను పనంగా పెట్టి నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ముందుకు పోయిందని తెలిపారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని (Red Zone) రెడ్ జోన్గా ప్రకటిస్తూ గతంలో రెండు నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్న కేవలం కమిషన్ల కోసమే పనులను నిర్వహించిందని ఆరోపించారు.

నివేదికల్లో చెప్పిన తీరుగా ఆ ప్రాంతంలోనే ప్రమాదం జరిగిందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande